Header Banner

రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై భయం వద్దు.. రైతులకు నష్టం జరగదు! మంత్రి నారాయణ హామీ!

  Thu Apr 24, 2025 10:44        Politics

రెండో దశ ల్యాండ్ పూలింగ్పై వ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. అమరావతి రాజధాని రీ లాంచ్ కార్యక్రమనికి వచ్చే నెల 2న ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు.. వేదిక ఏర్పాట్లు ఇవాళ పరిశీలించాం.. రోడ్ల పనులు.. పార్కింగ్ పనులు కూడా త్వరలో పూర్తి అవుతాయన్నారు.. అవసరం అయితే పార్కింగ్ స్థలాలను పెంచాలని సీఎం సూచించారు. కేవలం 58 రోజులల్లో.. లిటిగేషన్ లేకుండా రైతులు భూములు ఇచ్చారు.. సభ జరిగే ప్రాంగణంలో మూడు వేదికలు ఉంటాయి.. ఒక వేదిక పై రైతులు కూర్చుంటారు.. సీఎం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. అయితే, రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ఎవ్వరికీ భయాందోళనలు అవసరం లేదన్నారు నారాయణ.. వాణిజ్య వ్యాపార లావాదేవీలు జరగాలంటే భూమి అవసరం.. పెద్ద పెద్ద కంపెనీలు.. పరిశ్రమలు రావాలి.. అందుకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో రావాలి.. ఇందుకోసం అదనపు భూమి అవసరం..

కానీ, భూ సేకరణ చేస్తే రైతులకు నష్టం జరుగుతుందన్నారు.. మరోవైపు.. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని 2014లోనే అనుకున్నాం.. గుజరాత్ లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించామని తెలిపారు.. సీఎం చంద్రబాబుతో మాట్లాడి.. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం డిజైన్ ఎలా ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి నారాయణ.. కాగా, నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అమరావతిలో కూడా ఇదే విధమైన విగ్రహాల ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు. కాగా, డీపీఆర్ వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ విగ్రహం ఎత్తుపై పూర్తి స్పష్టత రానుంది. ప్రాథమిక అంచనాల మేరకు 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LandPooling #Amaravati #FarmersFirst #MinisterNarayana #APDevelopment #NoFear